భారత్ కు ప్రపంచ దేశాల రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.. రష్యా స్పెషల్ విషెస్

-

75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న భారత్ కు ప్రపంచ దేశాలు శుభాకాంక్షలు తెలిపాయి. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు భారత్కు రిపబ్లిక్ డే విషెస్ చెప్పాయి. మరోవైపు భారత్తో దౌత్యపరమైన ఉద్రిక్తత చెలరేగిన వేళ కెనడా సర్కార్ కూడా మన దేశానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసింది.

మొదటగా భారత్కు విషెస్ చెప్పిన అమెరికా అనేక రంగాల్లో ద్వై పాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఎదురు చూస్తున్నామని తెలిపింది. మరోవైపు భారత స్నేహితులకు శుభాకాంక్షలంటూ రష్యా ట్వీట్ చేసింది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సన్నీ దేఓల్‌ నటించిన ‘గదర్‌’ చిత్రంలోని ఓ హిట్‌ సాంగ్‌కు రష్యా ఎంబసీ ఉద్యోగులు ఆడిపాడగా ఈ వీడియోను న్యూదిల్లీలోని మాస్కో దౌత్య కార్యాలయం సోషల్ మీడియాలో షేర్ చేసింది. రష్యా-భారతీయ దోస్తీ కలకాలం వర్ధిల్లాలిని ఆ దేశ రాయబారి డెనిస్‌ అలిపోవ్‌ పోస్ట్ చేశారు.

దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కెనడా మనకు రిపబ్లిక్ డే విషెస్ చెప్పింది. ‘భారత్‌కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ దిల్లీలోని ఆ దేశ హై కమిషనర్‌ కార్యాలయం హిందీ, ఇంగ్లిష్‌లో పోస్టు పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version