ప్రపంచంలోనే అతిపెద్ద రామాయణం.. 3వేల ఇనుముతో తయారీ

-

అయోధ్య ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో రామభక్తులు శ్రీరామచంద్రుడిపై వివిధ రకాలుగా తమ భక్తిని చాటుకుంటున్నారు. తాజాగా యూపీలోని ఆగ్రాకు చెందిన ఓ సంస్థ వినూత్న రీతిలో తమ భక్తిని చాటుకుంది. అయోధ్యలో కొలువుదీరనున్న రామ్ లల్లాకు ప్రపంచంలోనే అతి బరువైన, అతిపెద్ద రామాయణాన్ని కానుకగా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది.

ఇందులో భాగంగా రామయ్య కోసం 3వేల కిలోల ఇనుమును ఉపయోగించి శాస్త్రీపురంలోని శ్రీ కృష్ణ గ్రంథాలయ ధారోహర్ అనే సంస్థ వాల్మీకి రామాయణాన్ని చెక్కుతోంది. ఇప్పటికే 95కిలోల ఇనుముతో డ్రాఫ్ట్ను సిద్ధం చేసింది. ఈ భారీ రామాయణాన్ని అనేక ప్రత్యేక ఫీచర్లతో రూపొందిస్తోంది. ఇది పూర్తైతే ప్రపంచంలోనే అతిపెద్ద, బరువైన రామాయణంగా మారనున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఇందులో సుమారు 30-35 పేజీలు ఉండనుండగా.. ప్రతి పేజీ సుమారు 100 కేజీల వరకు ఉంటుందని, మొత్తంగా 3వేల కిలోల బరువు ఉండనుందని వెల్లడించారు.

కరోనా లాక్డౌన్ సమయంలో ఇల్లు శుభ్రం చేస్తుండగా రామాయణం పుస్తకం కనిపించిందని.. అందులో కొన్ని పేజీలు చినిగిపోవడం చూసి బాధేసిందని శ్రీ కృష్ణ గ్రంథాలయ ధారోహర్ సభ్యురాలు ఆరాధన సైనీ తెలిపారు. అందుకే ఎన్నేళ్లయినా చెక్కుచెదరకుండా ఉండేందుకు లోహంపై రామాయణాన్ని రూపొందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. తెలిసినవారితో చర్చించి 95 కిలోల ఇనుమతో చిన్న రామాయణాన్ని తయారు చేశామని.. త్వరలోనే పూర్తి చేసి యూపీ సీఎంకు అందజేస్తాం అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version