పీఎఫ్ఐ బెదిరింపుల నేపథ్యంలో.. ఆర్ఎస్ఎస్ నేతలకు Y కేటగిరీ భద్రత

-

కేరళలోని ఐదుగురు ఆర్ఎస్ఎస్ నేతలకు వై కేటగిరీ భద్రతను కల్పించింది కేంద్ర సర్కార్. వారికి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో రక్షణ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పై ఐదేళ్లపాటు నిషేధం విధించింది కేంద్రం. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పీఎఫ్ఐ నిరసనలు చేపడుతోంది. కేరళలో ఇవి కాస్త తీవ్రంగా ఉన్నాయి. ఈ ఆందోళనల నేపథ్యంలోనే కేంద్రం అప్రమత్తమైంది. ఐదుగురు ఆర్ఎస్ఎస్ నేతలకు ముప్పు ఉందని గమనించి ముందుగానే భద్రత పెంచారు.

సీఆర్పీఎఫ్, వీఐపీ సెక్యూరిటీ విభాగం Y సెక్యూరిటీ ఇస్తాయి. ఒక్కో ఆర్ఎస్ఎస్ సభ్యుడికి ఇద్దరి నుంచి ముగ్గురి వరకూ కమాండోలు భద్రత కల్పిస్తారు. పీఎఫ్ఐ నిఘాలో ఆర్ఎస్ఎస్ ఉందని, ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించినట్టు సమాచారం. జూన్‌లో అగ్నిపథ్‌పై తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరిగాయి. ఆ సమయంలో బిహార్ బీజేపీ చీఫ్ సంజయ్ జైస్వాల్‌కు కూడా Y కేటగిరీ భద్రత కల్పించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version