ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ)’ జీఎస్‌టీ డిమాండ్ షోకాజ్ నోటీసు ఇచ్చింది. వినియోగదారుల నుంచి వసూలు చేసిన డెలివరీ ఫీజుపై జీఎస్‌టీకి సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ నోటీసుల్లో పేర్కొంది. డెలివరీ అనేది సేవ కాబట్టి 18 శాతం జీఎస్‌టీ కట్టాలని డీజీజీఐ ఈ క్రమంలోనే రూ.401 కోట్లు బకాయి చెల్లించాల్సి ఉందని చెప్పింది.
ఈ షోకాజ్ నోటీసుపై జొమాటో స్పందించింది. మా నుంచి ఎలాంటి పన్ను బకాయిలూ లేవు. డెలివరీ భాగస్వాముల తరఫున మేం డెలివరీ ఛార్జీలు వసూలు చేశాం. అలాగే కస్టమర్లకు మేం నేరుగా డెలివరీ సేవలు అందించలేదు. పరస్పర ఆమోదంతో కుదుర్చుకున్న నియమ నిబంధనల ప్రకారం డెలివరీ భాగస్వాములే ఆ సేవలను అందించారు. అని డీజీజీఐకి జొమాటో సంస్థ వివరించింది.
జొమాటోలో కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు బిల్లులో ఆహార పదార్థాల ధర.. ఫుడ్ డెలివరీ ఛార్జీ.. ఆహారం ధర, ప్లాట్‌ఫామ్ ఫీజుపై ఐదు శాతం పన్ను ఈ మూడు అంశాలు ఉంటాయి. ఈ ట్యాక్స్‌ను జీఎస్‌టీ మండలి 2022 జనవరి నుంచి అమలు చేస్తోంది.