ఈ రోజుల్లో ఊబకాయం అనేది వయసులో ఉన్న ఆడపిల్లలో మగపిల్లల కంటే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఊబకాయం వల్ల స్త్రీలల్లో ముఖ్యంగా బుుతుక్రమం దెబ్బతింటుంది. హార్మోన్స్ డిస్టబ్ అవటం వల్ల ఓవరీస్ లో నీటిబుడగలు కూడా వచ్చేస్తాయి. PCOD ప్రాబ్లమ్. ఓవరీస్ లో నీటిబుడగలు ఉన్నవారికి డాక్టర్స్ ప్రధానంగా..మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ కూడా ఇస్తుంటారు. ఇది డయబెటిక్ టాబ్లెట్..మరి ఈ సమస్యకు డయబెటిక్ కు సంబంధం ఏంటి అంటే..ఇన్సులిన్ ఉంటుంది కానీ..ఈ అధిక ఊబకాయంతో వచ్చే ఓవరీస్ సమస్య ఉన్నవారిలో పనిచేయకుండా ఉంటుంది.
దీనివల్ల షుగర్ లేకుండానే ఈ టాబ్లెట్ వాడి..షుగర్ డౌన్ అవుతుంది..ఇంకా ఎక్కువ ఆకలి వేస్తుంది. ఇలాంటి సమస్యతో బాధపడేవారికి..ఇంగ్లీష్ టాబ్లెట్ వాడుకుండా..ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను నాచురల్గా తగ్గించుకోవడానికి స్కై ఫ్రూట్ అనేది ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ పండు తీసుకోవడం వల్ల ఎలా మేలు జరుగుతుందో చూద్దాం..!
దీనినే షుగర్ బాదం అని కూడా అంటారు. ఇది చేదుగా ఉంటుంది. ఈ షుగర్ బాదంను ప్రొద్దున ఒకటి సాయంత్రం ఒకటి మింగితే చాలు..తినక్కర్లా..తింటే రోజంతా చేదుగా ఉంటుంది. ఇది సైంటిఫిక్ గా రక్తంలో చెక్కరను నియంత్రించే ఇన్సులిన్ పనిచేసేటట్లు చేస్తుందని నిరూపించారు. రక్తంలో చెక్కరె కణంలోపలకి త్వరగా వెళ్లేట్లుగా ఉపయోగపడుతుంది.
ఈ షుగర్ బాదం అనేది వాడుకుంటే..షుగర్ డౌన్ అవదు. అతి ఆకలి వేయదు. టాబ్లెట్ లాగా పనిచేస్తుంది కానీ, టాబ్లెట్ కు ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందుకని ఓవరీస్ లో నీటిబుడగలు ఉన్న అమ్మాయిలకు ఈ షుగర్ బాదం అనేది చాలా ఉపయోగపడుతుంది.
100లో 50మందికి ఈ సమస్య ఉంటుంది. కొంతమంది చూపించుకోక మాకు లేవు అనుకుంటారు. సన్నగా ఉన్నవారిలోనూ ఈ సమస్య ఉంటుంది కానీ..లావుగా ఉన్నవారిలో అధికంగా ఉంటుంది. హార్మోన్ డిస్టబెన్స్ ఒబిసిటీ ఎక్కువగా ఉండటం వల్ల వీరికి..అధికంగా వస్తాయి. అసలు ఒబిసిటీ వల్ల ఓవరీస్ లో బుడగలు ఎందుకు వస్తాయి అంటే..లావుగా ఉన్నవారికి కొవ్వుకణాల్లో కొవ్వు అధికంగా పేరుకుంటుంది. దానివల్ల కొవ్వు కణాల్లో ఇన్ఫ్లమేషన్ స్టాట్ అయి ఇంటర్ లూకిన్స్, సైటోకైన్స్ రిలీజ్ అవుతాయి..అవి కణం చుట్టూరా ఉండే పొర సరిగ్గా పనిచేయకుండా చేస్తాయి. ఫలితంగా చెక్కర కణంలోపలకి వెళ్లదు. దాని ద్వారా రక్తంలో చెక్కర పెరుగుతుంది, ఓవరీస్ లో నీటిబుడగలు వస్తాయి. త్వరగా ఫలితం రావాలని ఎక్కువగా వాడకూడదు. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి వాడితే చాలు.
ఆహారం తీసుకోవడానకి అరగంట ముందు మింగితే చాలు. ఇలా తీసుకుంటే..ఇన్సులిన్ రెసిస్టెంట్ తగ్గి, డయబెటీస్ రాకుండా ఉంటుంది. ఒబిసీటీని తగ్గించుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని సైంటిఫిక్ గా ఇచ్చారు. అయితే ఇది వాడేప్పుడు..మధ్యాహ్నం రైస్ మానేసి పుల్కాలు తింటూ..ఉదయం సాయంత్రం నాచురల్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. ఉడికిన ఆహారాలు తినకపోతే..హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. వీటితోపాటు కనీసం రెండుగంటల పాటు వ్యాయామాలు చేస్తూంటే..మూడు నాలుగు నెలల్లో బరువు తగ్గుతారు, ఓవరీస్ సమస్య పోతుంది. 25కేజీల బరువు తగ్గొచ్చు. ఇన్సులిన్ రెసిస్టెంట్ 15-20 రోజుల్లోనే తగ్గుతుంది.
మనం చేసిన తప్పులను ఇకనైనా సరిదిద్దుకోపోతే..ఒబిసిటీ సమస్య లైఫ్ టైం ఉంటుంది. దాని ద్వారా చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి అధిక ఊబకాయం ఉన్నవారు ఈ నియమాలు పాటిస్తూ.. మారడానికి ట్రై చేయండి..!
-Triveni Buskarowthu