టీటీడీ నిబంధనలు ఉల్లంఘించిన నయనతార.. పాదరక్షలతో..?!

-

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ప్రేమ జంట నయనతార-విఘ్నేశ్ శివన్ తిరుమలలో శ్రీవారి దర్శణానికి వచ్చారు. ఆలయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని కల్యాణోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు భక్తులు, అభిమానులు ఈ నూతన జంటను చూడటానికి భారీగా తరలివచ్చారు. వారి ఫోటోలు తీసేందుకు ఎంతో ఆసక్తి కనబరిచారు. ఫోటో షూట్‌కు నయనతార-విఘ్నేష్‌ కూడా సమయం కేటాయించారు.

నయనతార-విఘ్నేష్

అయితే రద్దీ భారీగా పెరగడంతో శ్రీవారి ఆలయం వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో నయనతార సెక్యూరిటీ గార్డులు భక్తులను అక్కడి నుంచి పంపించారు. ఈ మేరకు నూతన దంపతులను కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. అయితే.. ఆలయంలో నయనతార టీటీడీ నిబంధనలు ఉల్లంఘించింది. పాదరక్షలు ధరించుకుని ఆలయం ముందుకు వచ్చినట్లు సమాచారం. దీంతో పలువురు నయనతారపై మండిపడ్డారు. ఆలయంలో పాదరక్షలు ధరించడమేంటని ప్రశ్నించారు. కాగా, నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈ నెల 8వ తేదీన సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version