Samantha: సోషల్ మీడియా ద్వారా సమంత సంపాదన ఎన్ని కోట్లో..తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

-

బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత ప్రజెంట్ తన ప్రొఫెషనల్ కెరీర్ పైన ఫుల్ ఫోకస్ పెట్టేసింది. పాన్ ఇండియా ఫిల్మ్స్ తో పాటు రీజినల్ ఫిల్మ్స్ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ కూడా బాగానే పెంచేసింది.

మోడ్రన్ డ్రెస్సులో అందాలన్నీ ఆరబోసి కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సమంతకు..సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టా గ్రామ్ లో అయితే సమంత ఫాలోవర్స్ 24 మిలియన్స్ పైనే ఉండటం విశేషం. కాగా, సమంత సోషల్ మీడియా ద్వారా పలు బ్రాండ్స్ ను కూడా ప్రమోట్ చేస్తోంది.

ఒక్కో సినిమాకు సమంత రూ.3.5 కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. కాగా, ఇన్ స్టా గ్రామ్ వేదికగా బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా కూడా హీరోయిన్ బాగానే సంపాదిస్తోంది. సమంతకు నెలకు సోషల్ మీడియా ద్వారా రూ.3 కోట్ల కు పైనే సంపాదిస్తోందని సమాచారం. ఆ లెక్కన సినిమాలతో సమానంగా సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీ స్టేటస్ ఉపయోగించుకుని సమంత సంపాదన పైన ఫోకస్ పెట్టిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version