NBK 108: విజయదశమికి బాలయ్య ఆయుధ పూజ

-

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో “NBK 108” అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అలాగే ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తోంది. షైన్ స్క్రీన్స్ పతాకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ధి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ మూవీలో బాలకృష్ణ మునుపేన్నడు పోషించని పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ తో పాటు అనిల్ రావిపూడి తాలూకు కామెడీ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఉగాది రోజున ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ ని విడుదల చేసింది మూవీ యూనిట్. ఈ సినిమాను ఈ ఏడాది దసరాకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ” విజయదశమికి ఆయుధ పూజ” అని ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version