వరదల్లో చిక్కుకున్న కోటి రూపాయల ఎద్దు.. కాపాడిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది

-

దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు వణికిస్తున్నాయి. ఢిల్లీ వాసులు వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే.. యమునానది ఉప్పొంగడంతో ఢిల్లీ, నోయిడా ప్రాంతాలు వరద నీటిలో మునిగాయి. వరదల్లో చిక్కకుపోయిన పశువులను ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అయితే ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు కాపాడిన పశువుల్లో ఒక ఎద్దు కూడా ఉంది. ఇది దేశంలోనే నెంబర్ 1 బుల్.దీని పేరు ‘ప్రితమ్’. దీని విలువ BMW X5 కారు ధర కంటే ఎక్కువే.. ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఈ ఎద్దు ధరపై చర్చించుకుంటున్నారు.

ఘజియాబాద్‌లోని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) 8వ బెటాలియన్ కు చెందిన పశువులు, మేకలను రక్షించే బృందం ఈ ఫోటోలు, వీడియోలను ట్విట్టర్ లో షేర్ చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రీతమ్ బుల్ సహా మరికొన్ని పశువులను రక్షించేందుకు NDRF బృందాలు తీవ్రంగా శ్రమించాయి. వాటిలో భారత దేశ నెంబర్ వన్ బుల్ ‘ప్రితమ్ ’కూడా ఉంది. అయితే ‘ప్రీతమ్’ ధర అక్షరాల కోటి రూపాయలు.

 

అయితే సోషల్ మీడియాలో ఈ ఎద్దు ప్రితమ్ తో సహా రెండు గేదెలను పడవలకు తాళ్లతో కట్టి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.యమునా వరద ప్రవాహం నది ఒడ్డున ఉన్న దాదాపు 550 హెక్టార్ల భూమిని ముంచెత్తింది, 5,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఎనిమిది గ్రామాలపై వరద ప్రభావం చూపింది. కాగా.. పశువులు, కుక్కలు, కుందేళ్లు, బాతులు, రూస్టర్లు, గినియా పందులతో సహా దాదాపు 6,000 జంతువులను కూడా గురువారం నుంచి సురక్షిత ప్రాంతాల నుండి సురక్షితంగా తరలించినట్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version