ఒక్క వ్యక్తి కోసం 15 కిలో మీటర్ల వాగుని జల్లెడ పడుతోన్న NDRF 

-

బీరంగూడలోని వరదల్లో కొట్టుకుపోయి ఐదు రోజులైనా ఆనంద్ అనే వ్యక్తి ఆచూకీ ఇంకా దొరకలేదు. ఇసుక బాయి వాగులో కొట్టుకుపోయిన ఆనంద్ కోసం NDRF ఆపరేషన్ కొనసాగుతోంది. 15 కిలో మీటర్ల వాగు మొత్తాన్ని NDRF , మూడు గజ ఈతగాళ్ళు బృందాలు గాలిస్తున్నాయి. డ్రోన్ కెమెరాల ద్వారా వాగు చుట్టూ కూడా పోలీసులు పరిశీలిస్తున్నా ఆచూకీ దొరకడం లేదు. 5 రోజులుగా ఆనంద్ ఆచూకీ కానీ కారు ఆచూకీ కానీ దొరకడం లేదు. తిరుపతి ప్రసాదం పంచడానికి వెళ్లిన ఆనంద్ , వరదల్లో కొట్టుకుపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఇక నిన్న వాగు దగ్గరకు గాలింపు చర్యలను పరిశీలించిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వరద నీరు ఎక్కువగా ఉండటం వలన రెండు రోజులుగా వెతికినా ఫలితం లేకుండా పోయిందని వాగులో వెతకడానికి నిపుణులైన వ్యక్తులను రప్పించేలా అధికారులతో మాట్లాడతామని అన్నారు. వాగులో గల్లంతైన ఆనంద్ కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే  పోలీసు , రెవెన్యూ అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version