నెదర్లాండ్ మరో సంచలనానికి రెడీ, బంగ్లాను బెంబేలేత్తిస్తున్న బౌలర్లు !

-

కోల్కతా లో జరుగుతున్న మరో మ్యాచ్ లో బంగ్లాదేశ్ మరియు నెదర్లాండ్ లు పోటీ పడుతున్నాయి, నెదర్లాండ్ ఇచ్చిన 230 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బంగ్లాదేశ్ నానా తంటాలు పడుతోంది.. ఈ వరల్డ్ కప్ లో తమ ప్రదర్శనతో ఎంతగానో ఆకట్టుకుంటున్న నెదర్లాండ్ జట్టు మరో విజయానికి చక్కని బాటలు వేసుకుంది. ఇప్పటికే సౌత్ ఆఫ్రికాను మట్టికరిపించిన డచ్ టీం బంగ్లాను ఓడించడానికి సిద్ధంగా ఉంది. నెదర్లాండ్ బౌలర్లు బంగ్లాదేశ్ ను బెంబేలెత్తిస్తున్నారు.. ప్రస్తుతం చూస్తే బంగ్లాదేశ్ 100 పరుగుల వద్ద ఉండగా సగానికి పైగా 6 వికెట్లు కోల్పోయింది. లిటన్ దాస్ 3, టాంజిద్ 15, శాంటో 9, మెహిదీ హాసన్ 35, షకీబ్ 5 మరియు రహీం 1 అందరూ పెవిలియన్ కు చేరుకున్నారు. నెదర్లాండ్ చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ఎక్కడ కుదురుకుని అవకాశాన్ని బంగ్లాకు ఇవ్వలేదు.

బంగ్లాకు చేతిలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి… విజయం సాధించాలంటే ఇంకా 130 పరుగులు చేయాల్సి ఉంది. ఇది కనుక గెలిస్తే వరల్డ్ కప్ లో రెండు మ్యాచ్ లు గెలిచిన జట్టు గా అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version