చలికాలంలో జలుబు, దగ్గు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

-

చలికాలం మొదలైంది. చలిగాలు శరీరాన్ని తాకుతూ గజగజా వణికిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జలుబు, దగ్గు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చల్లనైన వాతావరణానికి శ్వాసకోశ సంబంధ వ్యాధులు చాలా తొందరగా వ్యాపిస్తాయి. జలుబు, దగ్గు.. చూసేందుకు పెద్ద ప్రమాదంగా కనిపించవు కానీ నిర్లక్ష్యం చేస్తే అవే పెద్ద ప్రమాదాలకి దారి తీస్తాయి. అందుకే చలికాలంలో వచ్చే జలుబు, దగ్గులని నిర్లక్ష్యం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

జలుబు, దగ్గు త్వరగా తగ్గడానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

చిన్న పాటి అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొన్ని మెంతులు, తగినంత పసుపు, ఒక టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు, ఒక టేబుల్ స్పూన్ వాము ఇంకా పది తులసి ఆకులు.. వీటన్నింటినీ ఒక పాత్రలోకి తీసుకుని అందులో కొన్ని నీళ్ళు పోసి ఆ ద్రవం సగం అయ్యే వరకు మరిగించాలి. ఈ ద్రావణాన్ని రోజూ ఉదయం లేవగానే తీసుకోవాలి.

చల్లటి ద్రావణాలైన కూల్ డ్రింక్స్, పెరుగు, చక్కెర ఎక్కువ శాతం కలిగిన వాటిని తీసుకోవద్దు.

చల్లటి నీటితో స్నానం చేయవద్దు. గోరువెచ్చని నీటితోనే చేయాలి. అలాగే తాగడానికి కూడా గోరువెచ్చని నీళ్ళు చాలా మంచిది.

గొంతులో గరగర ఉన్నట్లయితే పొద్దున్న పూట తేనే తాగండి. పాలల్లో పసుపు వేసుకుని తాగినా మంచిదే.

రోజూ కొన్ని తులసి ఆకులని నమలండి. వీటన్నింటితో పాటు ఎక్కువ కొవ్వు కలిగిన పదార్థాలని తీసుకోవద్దు. అలాగే బయట వీధుల్లో చిరుతిండ్లు తగ్గించాలి.

ఈ జాగ్రత్తలు పాటిస్తే జలుగు, దగ్గు నుండి బయటపడవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version