Bedurulanka2012 : బెదురులంకలో DJ టిల్లు బ్యూటీ

-

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తికేయ తన నెక్స్ట్ సినిమాకు రెడీ అయ్యారు. నేహా శెట్టి హీరోయిన్ గా క్లాక్స్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకి ‘బెదురులంక 2012’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాత. ఎల్బీ శ్రీరామ్‌, అజయ్‌ ఘోష్‌, సత్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


అయితే ఇవాళ ఈ సినిమా హీరోయిన్‌ పోస్టర్‌ ను అధికారికంగా రిలీజ్‌ చేశారు. హీరోయిన్‌ నేహా శెట్టి పోస్టర్‌ ను రిలీజ్‌ చేశారు. ఇక ఈ పోస్టర్‌ లో నేహా శెట్టి చాలా హాట్‌గా కనిపిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ..“కామెడీ డ్రామాగా.. గోదావరి నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మణిశర్మ ఐదు అద్భుతమైన పాటలిచ్చారు. ఇందులో ఓ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యమందించారు’’ అని దర్శకుడు తెలిపారు. ఇక ఈ మోషన్‌ పోస్టర్‌ లో హీరో కార్తికేయ చాలా పవన్‌ ఫుల్‌ గెటప్‌ లో కనిపించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version