నియోపోలిస్ లో రిజ‌ర్వాయ‌ర్ నిర్మించేందుకు ప్ర‌ణాళిక‌లు..!

-

కోకాపేట్, నియోపోలిస్ ప్రాంతాల్లో ప‌ర్య‌ట‌న‌ హెచ్ఎండీఏ క‌మిష‌న‌ర్ సర్ఫరాజ్ అహ్మద్, జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్ రెడ్డి పర్యటించారు. నియోపోలిస్ లో రిజ‌ర్వాయ‌ర్ నిర్మించేందుకు ప్ర‌ణాళిక‌లు రచిస్తున్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతాల్లో నీటి అవసరాల దృష్ట్యా.. రిజర్వాయర్ నిర్మాణానికి కేటాయించిన స్థల పరిశీలన చేసారు. గోదావరి ఫేజ్-2 ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకుని ఖానాపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు తరలించడానికి.. నియోపోలిస్ లో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పంప్ హౌజ్, స్థానిక అవసరాల కోసం రిజర్వాయర్ నిర్మించనుంది జలమండలి.

అక్కడి నుంచి పరిసర ప్రాంతాలకు నీటి సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు జలమండలి ఎండీ. ఖానాపూర్ బ్యాలెన్సింగ్ రిజ‌ర్వాయ‌ర్ ను పరిశీలించారు అధికారులు. మంజీరా, కృష్ణా, గోదావ‌రి ప‌థ‌కాల ద్వారా ఎక్క‌డి నుంచి వ‌చ్చే నీటినైనా ఇక్క‌డ నుంచి గ్రావిటీ ద్వారా న‌గ‌రానికి స‌ర‌ఫ‌రా చేసే అవ‌కాశం ఉన్నందున‌.. భ‌విష్య‌త్తు అవ‌స‌రాల కోసం ఇక్క‌డ రిజ‌ర్వాయ‌ర్, నీటి శుద్ధి కేంద్రాలు నిర్మించ‌డానికి ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాల‌ని అధికారులకు ఆదేశం ఇచ్చారు. కోకాపేట్ గ్రామంలోని జ‌ల‌మండ‌లి రిజ‌ర్వాయ‌ర్ ప్రాంగ‌ణంలో నిర్మిస్తున్న ప్రెజ‌ర్ ఫిల్ట‌ర్స్ ను ప‌రిశీలించిన అధికారులు.. ఫిబ్ర‌వ‌రి 15 లోపు వీటి నిర్మాణాల‌ను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాల‌ని.. వేస‌వి అవ‌స‌రాల కోసం ఇక్క‌డ ట్యాంక‌ర్ ఫిల్లింగ్ స్టేష‌న్ నిర్మాణానికి కావాల్సిన ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాల‌ని అధికారుల‌కు సూచనలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news