సైబర్ క్రైమ్ థ్రిల్లర్ గా “నెట్” ట్రైలర్

-

టాలీవుడ్‌ స్టార్‌ కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణ మరియు అవికా గోర్‌ ప్రధాన పాత్ర ల్లో ”నెట్‌ ” అనే వెబ్‌ సిరీస్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే… ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. సీక్రెట్‌ కెమెరాల మధ్య ప్రియా అనే అమ్మాయి జీవితం లోకి రహస్యంగా తొంగి చూసే…మిడిల్‌ క్లాస్‌ వివాహితుడి కథ తో ఈ మూవీ తెరకెక్కినట్లు ట్రైలర్‌ చూస్తుంటే మనకు అర్థమవుతోంది.

అయితే.. అది అతని జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది.. అనేది ఈ సినమాకు ప్రధాన టర్నింగ్‌ పాయింట్‌. కొత్త డైరెక్టర్‌ భార్గవ్‌ మాచర్ల దర్శకత్వం లో వస్తున్న వెబ్‌ సినిమా ”నెట్‌ ”. రాహుల్‌ రామకృష్ణ, అవికా గోర్‌ ప్రధాన పాత్రల్లో చేస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ ను… రాహుల్‌ కు మంచి మిత్రుడైన ప్రముఖ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా విడుదల చేశారు. ” రాహుల్‌.. మీరు ప్రతిభావంతుడు. నాకు ట్రైలర్‌ బాగా నచ్చేసింది. ” అటూ సందీప్‌ రెడ్డి వంగా ట్వీట్‌ చేశారు. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ఈ మూవీ సెప్టెంబర్‌ 10 న విడుదల కానుంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version