రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే హన్మకొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డికి చేనేత కార్మికులు పాలాభిషేకం చేశారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ‘చేనేత అభయహస్తం’ పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకం కింద నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం రూ.168 కోట్లు కేటాయించింది.
కమలాపూర్‌కు చెందిన కార్మికులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కార్మికులు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తీసుకున్న చొరవ వల్ల ఎంతో మంది నేత కార్మికులకు మేలు జరుగుతుందన్నారు. చేనేత కార్మికుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మూడు పథకాలను అమలు చేయడం సంతోషంగా ఉందని వెల్లడించారు.రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చేనేత కార్మికులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.