బొత్స ను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

-

బొత్స ను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ కొత్త మంత్రివర్గ కూర్పును పూర్తి చేశారు.తొలి మూడేళ్లపాటు మున్సిపల్ శాఖ విధులు నిర్వహించిన బొత్స సత్యనారాయణ కు ఈ దఫా విద్యాశాఖను జగన్మోహన్ రెడ్డి అప్పగించారు.ఈ నేపథ్యంలో ఓ పాత వీడియో నెటిజన్లు విపరీతంగా వైరల్ వైరల్చేస్తూ ఆయనను ట్రోల్ చేస్తున్నారు.ఈ వీడియో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ కి సంబంధించింది గా తెలుస్తుంది.

ఈ ఇంటర్వ్యూలో ఆయన ఇంగ్లీషులో మాట్లాడారు.మన విద్యాశాఖ మంత్రి పలుకులు అంటూ నెటిజన్లు ఆయనను ట్రోల్ చేస్తున్నారు.ఇక నుండి ఆంధ్రప్రదేశ్ లో విద్య వెలుగొందాలి అంటే అది సీనియర్ రాజకీయ నేత అయిన బొత్స నోటి నుండి వినాల్సిందే అంటూ నెటిజన్లు హడావిడి మొదలెట్టేశారు.ఒక్కోసారి బొత్స సత్యనారాయణ మాట్లాడే మాటలు అర్థం కాక జనాలు జుట్టు పీక్కుంటారని, ట్విట్టర్ లో బొత్స వీడియో ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

Read more RELATED
Recommended to you

Exit mobile version