కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.రెండు లేదా ఐదు రోజుల్లో బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందని ఆయన ప్రకటించారు.ఇప్పటికే స్టేట్ చీఫ్ నియామక ప్రక్రియ ఆలస్యమైంది. అయితే, మళ్లీ బండి సంజయ్‌కే చాన్స్ ఇస్తారా? ఇటల రాజేందర్‌కు అవకాశం ఇస్తారా? అనే విషయంపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది.
కాగా, రాష్ట్రంలో జరిగిన టీచర్స్, గ్రాడ్యేయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘సేవ్ తెలంగాణ సపోర్ట్ బీజేపీ లక్ష్యంతో ముందుకెళ్తాం. ఎమ్మెల్సీ ఎన్నికలతో ప్రజావ్యతిరేకత అర్థమైంది. మేధావులు, విద్యావంతులు బీజేపీవైపు నిలిచారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యం. నేను తాత్కాలిక అధ్యక్షుడిని.రెండు లేదా ఐదు రోజుల్లో బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తారు’ అని ఆయన పేర్కొనడం గమనార్హం.