హైదరాబాద్‌లో నవ వధువు ఆత్మహత్య.. !

-

హైదరాబాద్‌ మహా నగరంలో మరో విషాదం చోటు చేసుకుంది. శంషాబాద్‌ పీఎస్‌ పరిధి లో నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకున్ నవ వధువు పెండ్యాల గ్రామానికి చెందిన ప్రగతిగా గుర్తించారు పోలీసులు. ప్రగతి పెళ్లి మరో 20 రోజులు సమయం ఉండగానే… ఇంట్లో ఈ విషాదం చోటు చేసుకుంది.

కొన్ని రోజుల కిందటే.. నవ వధువు ప్రగతి కి రమాకాంత్‌ అనే యువకుడితో వివాహం నిశ్చయమైంది.
వరుడు రమాకాంత్‌ ఆస్ట్రేలియా లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 22 వ తేదీన రమాకాంత్‌ – ప్రగతి ల నిశ్చితార్థం జరిగింది. ఈ నేపథ్యం లోనే నవంబర్‌ 17న వివాహం నిశ్చయమైంది. అయితే.. పెళ్లి కి ర మా కాంత్ నిరా కరించడం తో మనస్తాపం తో ఆత్మహత్య చేసుకుంది ప్రగతి. ఈ సంఘటన ఈ నెల 15 న చోటు చేసుకోగా.. చాలా ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version