ఏపీలో జనవరి 1 నుండి కొత్త చలాన్ రేట్లు..మోత మోగిపోద్ది జాగ్రత్త !

-

హెల్మెట్ లేకపోతే ఏముందిలే వంద చలాన్ కడితే సరిపోతుంది అనుకుని రోడ్డుపై చక్కర్లు కొడదాం అనుకుంటే ఇకపై ఆ పప్పులు ఉడకవ్ ఎందుకంటే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఇకపై ఏపీలో భారీగా జరిమానాలు విధించనున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఈ చట్టం కొత్త ఏడాది జనవరి 1 నుంచే అమలులోకి రానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన మోటార్ వాహనాల చట్టం 2021 జనవరి 1 నుంచి అమలు కానుంది. ఈ చట్టం ప్రకారం  ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే జరిమానాలు భారీగా పెరగనున్నాయి. కొత్త చట్టం ప్రకారం ఇక మీదట హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే 1035 రూపాయల జరిమానా.

ఒకవేళ పొరపాటున హెల్మెట్ లేకుండా నడుపుతూ రెండోసారి పట్టుబడితే గతంలో జరిమానా కంటే రెట్టింపు జరిమానా 2070 కట్టాల్సిందే..మొబైల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే 5,035 రూపాయల  జరిమానా. ఇదే కేసులో రెండోసారి పట్టుబడితే మళ్ళీ రెట్టింపు జరిమానా 10070 కట్టాల్సిందే. ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే 5 వేలు, రెండోసారి పట్టుబడితే 10 వేల జరిమానా. అధిక వేగంతో వాహనం నడిపితే 1,035, రెడ్​ సిగ్నల్ నిబంధన అతిక్రమిస్తే 1,035 జరిమానా. మైనర్లకు వాహనం ఇస్తే 5,035 జరిమానా. వాహనానికి సరైన ధ్రువపత్రాలు లేకుంటే 2 వేలు జరిమానా. ఇవి లేకుండా రెండోసారి పట్టుబడితే 5 వేల జరిమానా. పర్మిట్ లేని వాహనానికి రూ.10 వేలు, ఓవర్ లోడ్​కు రూ.20 వేల ఇలా ఒక్కో దానికి ఒక్కొలెక్కుంది. ముఖ్యంగా అంబులెన్స్, ఫైరింజన్లకు దారి ఇవ్వకపోతే 10 వేలు. పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫారసు చేస్తారు.  

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version