కొవిడ్ -19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. ఈ వైరస్ ధాటికి విద్య, ఉపాధి, ఆర్థిక రంగాలన్నీ కుప్పకూలాయి. ఇప్పటి వరకు ఈ వైరస్‌కు ఎలాంటి టీకా గానీ మందుగానీ అందుబాటులోకి రాలేదు. ప్రమా దకరమైన ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రయోగాలు కొనసాగుతున్నాయి. అ యితే నిర్దేశిత ప్రాంతంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి శైకోక్యాన్ అనే అధునాతన యంత్రం మార్కెట్లోకి వచ్చింది.
క్యాలిన్ సైబర్ నెటిక్స్ లిమిటెడ్ కంపెనీ వారు రూపొందించిన ఈ అధునాతన యంత్రాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం పరిశీలించారు. యాభై మంది నుంచి వంద మంది వరకు సమావేశమయ్యే గదిలో లేదా మందిరంలో వేయి చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక యంత్రం ఖరీదు రూ.19,999లు ఉంటుందని అరవ్ అసోసియేట్స్ ప్రతినిధులు తెలిపారు. దీన్ని కింగ్ కోఠి దవాఖానలో ప్రయోగాత్మకంగా అమర్చడానికి మంత్రి అనుమతించినట్టు తెలిపారు.