షాకింగ్ : తండ్రిని చంపి కోసుకు తిన్న కొడుకు !

-

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల కేంద్రంలోని శ్రీరాం నగర్ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రిని చంపిన తనయుడు ఆయన్ని ముక్కలు ముక్కలుగా చేసి కోసుకు తిన్న ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీరాం నగర్ కాలనీలో నివాసం ఉంటున్న యాదయ్యను ఆతని కుమారుడే చంపేశాడు అంతే కాదు చంపి కత్తితో ఇంట్లోనే తిరుగుతూ ఉండిపోయాడు తనయుడు శ్రీనివాస్. ఇరుగుపొరుగు నుండి విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అతన్ని బయటికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంఘటన స్థలానికి ఆక్టోపస్ పోలీసులు, సైబరాబాద్ పోలీస్ లు ఇద్దరూ చేరుకున్నారు. అయితే కొడుకు శ్రీనివాస్ మానసిక స్థితి సరిగ్గా లేదని అతనికి ఆరోగ్యం కూడా సరిలేదని స్థానికులు చెబుతున్నారు. అయితే చుట్టుపక్కల వారు ఆందరూ పొగయ్యి కిటికిలోనుండి ఫోటోలు వీడియోలు తీస్తున్నారని ఇంట్లో లైట్లు ఆర్పీ కూర్చున్నాడు సదరు కొడుకు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version