ఎల్ఐసీ నుంచి కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్.. కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్యం..

-

ప్రముఖ ప్రభుత్వ భీమా కంపెనీ ఎల్ఐసీ ప్రజలకు ఎన్నో రకాల సేవలను అందిస్తుంది.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందుతున్నారు.. దాంతో ఎక్కువ మంది ఈ పథకాల వైపు మొగ్గు చూపిస్తున్నారు.. అందులో భాగంగానే ఈ సంస్థ కొత్త ఇన్సూరెన్స్ పాలసిని అందుబాటులోకి తీసుకొని వచ్చింది.. టెక్-టర్మ్ అనేది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, స్వచ్ఛమైన రిస్క్ ప్రీమియం ఉన్న జీవిత బీమా ప్లాన్..అయితే ఈ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ కాంపోనెంట్ లేదా ఇన్సూరర్ లాభాలు లేదా బోనస్‌లలో భాగస్వామ్యాన్ని అందించదు.

నాన్-లింక్డ్ ఇన్సూరెన్స్ అంటే పాలసీదారు ప్రీమియంలు ఏ ఫండ్‌లో పెట్టుబడి పెట్టరు. అలాగే రాబడులు లేదా ప్రయోజనాలు ఎలాంటి పెట్టుబడి పనితీరుతో లింక్ చేయరు.ఈ రకమైన బీమాను టర్మ్ ఇన్సూరెన్స్ లేదా ప్యూర్ ఇన్సూరెన్స్ అని కూడా అంటారు. నాన్-పార్టిసిపేటింగ్ ఇన్సూరెన్స్ అంటే పాలసీదారుకు బీమాదారు లాభాలు లేదా బోనస్‌లలో పాల్గొనే అర్హత లేదు. పాలసీదారు చెల్లించే ప్రీమియంలు పెట్టుబడి ప్రయోజనాల కోసం కోసం కాకుండా బీమా కవరేజీని అందించడానికి మాత్రమే ఉపయోగిస్తారు.. ఈ ప్లాన్ ఇప్పటివరకు ఆన్లైన్ లోనే అందుబాటులో ఉంది..ఈ పాలసీ కోసం ఎల్ఐసీ పాలసీ కోసం అధికారిక వెబ్ సైట్ ను చూడవచ్చు..

*. కనీస ప్రాథమిక హామీ మొత్తం రూ. 50,00,000

*. గరిష్ఠ హామీ మొత్తం- పరిమితి లేదు..కనీస పాలసీ కాలవ్యవధి- 10 సంవత్సరాలు..గరిష్ట పాలసీ వ్యవధి- 40 సంవత్సరాలు..

*. ప్రీమియం చెల్లింపు కాలవ్యవధి- రెగ్యులర్ ప్రీమియం, పాలసీ టర్మ్‌లా ఉంటుంది..

*.వాయిదాల ప్రీమియం చెల్లింపు విధానం కూడా అందుబాటులో ఉంటుంది. సంవత్సరానికి/అర్ధ-సంవత్సరానికి లేదా సింగిల్ ప్రీమియంగా కూడా చెల్లించవచ్చు…

*. వాయిదాల ప్రీమియం చెల్లింపు విధానం కూడా అందుబాటులో ఉంటుంది. సంవత్సరానికి లేదా సింగిల్ ప్రీమియంగా కూడా చెల్లించవచ్చు..

Read more RELATED
Recommended to you

Exit mobile version