ఏపీ హై కోర్టుకు కొత్త జ‌డ్జిలు.. నోటిఫికేషన్ జారీ

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర హై కోర్టుకు కొత్త జ‌డ్జిలు వ‌చ్చారు. ఏపీ హై కోర్టుకు కొత్త జ‌డ్జిల‌ను ఇటీవ‌ల కొలిజీయం సిపారసు చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కేంద్ర ప్ర‌భుత్వం కూడా విడుద‌ల చేసింది. తాజాగా శ‌నివారం ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం కొత్త జ‌డ్జిల నియామక నోటిఫికేషన్ రి ప‌బ్లిష్ చేసింది. కాగ ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర హై కోర్టుకు కొత్త జ‌డ్జిలుగా గ‌న్న‌మ‌నేని రామ కృష్ణ‌, కొన‌కంటి వెంక‌టేశ్వ‌ర్లు, నిమ్మ‌గ‌డ్డ వెంక‌టేశ్వ‌ర్లు, స‌త్తి సుబ్బారెడ్డి, త‌ర్లాడ రాజ‌శేఖ‌ర్ రావు, చీమ‌ల పాటి ర‌వి, వ‌డ్డి బోయిన సుజాత ఉన్నారు.

కాగ ఏపీ హై కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా.. కొత్త జడ్జిల‌తో త్వ‌ర‌లోనే ప్ర‌మాణ స్వీకారం చేయించారు. కొత్త జ‌డ్జిల‌కు ప్ర‌మాణ స్వీకారం ముగిస‌న త‌ర్వాత.. సీనియారిటీ ప్రాతి పాద‌కగా తీసుకుని బాధ్య‌త‌ల‌ను కేటాయించ నున్నారు. కాగ గ‌త కొద్ది రోజుల నుంచి ఏపీ హై కోర్టులో న్యాయ‌మూర్తుల సంఖ్య త‌క్కువగా ఉండ‌టంతో కేసులు అన్నీ పెండింగ్ లో ఉంటున్నాయ‌ని ప‌లువురు అస‌హానం వ్య‌క్తం చేశారు. తాజా గా కొత్త‌గా ఏడుగురు న్యాయ‌మూర్తులు రావ‌డంతో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర హై కోర్టు ఖాళీలు భ‌ర్తీ అయిన‌ట్టే.

Read more RELATED
Recommended to you

Exit mobile version