కస్టమర్లకు షాక్ ఇస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ..వడ్డీ రేట్ల పై బాదుడే..!

-

ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మరో షాకింగ్ న్యూస్ ను చెప్పింది.రుణ గ్రహీతలకు షాకిచ్చింది. బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతూ ప్రకటన చేసింది. ఈ పెంపుతో కొత్త, పాత రుణ గ్రహీతలకు లోన్లు మరింత భారంగా మారనున్నాయి. వచ్చే వారం రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ ముందస్తుగానే రేట్ల పెంపు చేపట్టింది. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు మానిటరీ పాలసీ కమిటీ వడ్డీ రేట్లను మరింత పెంచుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ రేట్ల పెంపు ఖాయమని స్పష్టం అయ్యింది.

హెచ్‌డీఎఫ్‌సీ గృహ రుణాలపై తన రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును ఆగస్టు 1, 2022 నుంచి 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది’ అని తెలుపుతూ ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ రెండు నెలల్లోనే ఈ వడ్డీ రేట్లను పెంచడం ఇది ఐదోసారి..గత మే నెల నుంచి వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి.115 బేసిస్ పాయింట్ల మేర పెరిగాయి..

ఇకపోతే కొత్త రుణ గ్రహీతలకు సమీక్షించిన ఈ రేట్లు 7.80 శాతం నుంచి 8.30 శాతం మధ్యలో ఉన్నాయి. ఈ రేట్లు లోన్ మొత్తం బట్టి ఉంటాయి. ప్రస్తుతం కొత్త రుణ గ్రహీతలపై 7.55 శాతం నుంచి 8.05 శాతం మధ్యలోనే వడ్డీ రేట్లను విధిస్తోంది. ఇక పాత కస్టమర్లకు. 25 బేసిస్ పాయింట్లను పెంచింది. ఆర్బీఐ విధిస్తున్న కొత్త ఆర్థిక సంస్థలు, బ్యాంకులు కూడా లోన్లు తీసుకున్న వారిపై వడ్డీ రేట్లను పెంచడం మొదలు పెట్టాయి. ఈ పెంపుకి ఇంకా ఎండ్ కార్డు పడలేదు. వడ్డీ రేట్ల పెరుగుదల కొనసాగుతూనే ఉంది.. ఇలా రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను పెంచితే రుణం పొందాలని భావించేవారికి మరింత భారం కానున్నాయి. ఇక ఆగస్టు ఒకటి నుంచి బ్యాంక్ సేవలకు సంభందించిన కొత్త రూల్స్ అమలు కానున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version