హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు కొత్త స్కీం.. ఈజీగా రుణం పొందొచ్చు..!

-

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లింది. ఇక కొన్ని బ్యాంకులు ఇతర సంస్థలతో టై అవుతున్నాయి. తాజాగా హెచ్‌డీఎఫ్‌సీలో బ్యాంకు అకౌంట్ ఉందా. అయితే ఐడి మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తాజాగా ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త అందించింది.

hdfc-bank

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చిందని యాజమాన్యం తెలిపింది. బ్యాంక్ తాజాగా అపోలో హాస్పిటల్స్‌తో జత కట్టిందని తెలిపారు. అపోలో హాస్పిటల్స్ తీసుకువచ్చిన హెల్తీ లైఫ్ ప్రోగ్రామ్‌లో భాగమైందన్నారు. తన కస్టమర్లకు కూడా ఈ సేవలు అందిస్తోందని తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. అపోలో హాస్పిటల్స్‌తో జతకట్టడం వల్ల బ్యాంక్ కస్టమర్లకు ప్రయోజనం కలుగనుంది. హాస్పిటల్ బిల్లులు చెల్లించడానికి బ్యాంక్ కస్టమర్లు బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవచ్చునన్నారు. ఏకంగా రూ.40 లక్షల వరకు రుణం పొందొచ్చునని తెలిపారు. అది కూడా 10 నిమిషాల్లోనే బ్యాంక్ కస్టమర్ల అకౌంట్లలోకి ఈ డబ్బులు వచ్చి చేరతాయని తెలిపారు.

ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్లకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తున్నాయని బ్యాంకు యాజమాన్యం తెలిపింది. క్రెడిట్ కార్డులపై ఈ బెనిఫిట్ వర్తిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఈవో, ఎండీ ఆదిత్య పురి మాట్లాడుతూ.. కస్టమర్లకు అవసరం అయినప్పుడు వెంటనే ఈ రుణం పొందొచ్చని తెలిపారు. ఇక ఐ కేర్, డెంటల్ కేర్, మెటర్నిటీ, ఐవీఎఫ్ వంటి వాటికి రుణం తీసుకోవచ్చునని తెలిపారు. తీసుకున్న రుణాన్ని సులభతర ఈఎంఐ రూపంలో చెల్లించొచ్చునన్నారు. అంతేకాకుండా క్రెడిట్ కార్డుపై కూడా ఈఎంఐ ఆప్షన్, ఇన్‌స్టంట్ డిస్కౌంట్ వంటి ప్రయోజనాలు పొందొచ్చని బ్యాంక్ తెలిపింది. ఇక అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శోభనా కామినేని మాట్లాడుతూ.. 6.5 కోట్ల మంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version