దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఈ సేవలతో చాలా మంది లాభాలని పొందుతున్నారు. భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ వినియోగదారుల కోసం యోనో సేవలు కూడా అందిస్తోంది. ఈ యాప్ తో చక్కగా లోన్ మొదలు స్టేట్‌మెంట్ దాకా.. ఇలా ఎన్నో రకాలు సేవలను పొందవచ్చు.
ఇదిలా ఉంటే ఎస్‌బీఐ యోనో యాప్ లో ఇంకో కొత్త సేవ రానుంది. యోనోలో యూపీఐ సేవలను అందిస్తోంది. ఐసీఐసీఐ, యాక్సిస్ వంటి ప్రైవేటు బ్యాంకులకు పరిమితమైన యూపీఐ సేవలని స్టేట్ బ్యాంక్ తెచ్చింది. ఇక ఈ కొత్త సర్వీస్ కి సంబంధించి పూర్తి వివరాలని చూసేద్దాం… ఈ కొత్త సేవల తో యూజర్లు యోనో యాప్ ద్వారా స్కాన్ చేసి పేమెంట్స్ చేసుకోవచ్చు.
అదే విధంగా ఇతర యూపీఐ యాప్స్‌లో ఉన్నట్లుగానే బై కాంటాక్ట్స్, రిక్వెస్ట్ మనీ వంటి సర్వీసెస్ ని కూడా పొందవచ్చు. కార్డు అవసరం లేకుండానే ఏటీఎమ్ నుంచి డబ్బులు విత్‌డ్రా చెయ్యవచ్చు.
క్యూఆర్‌కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఏటీఎం నుండి డబ్బులు విత్‌డ్రా చెయ్యచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 68వ వార్షికోత్సవం సందర్భంగా వీటిని తీసుకొచ్చింది. అంతే కాదు ఇతర బ్యాంక్ కస్టమర్స్ కూడా యోనో ని ఉపయోగించవచ్చు.