పరిటాల ఫ్యామిలీకి కొత్త ట్విస్ట్.. ఆ సీటు ఎవరికి?

-

అనంతపురం జిల్లాలో పరిటాల ఫ్యామిలీకి ఊహించని ట్విస్ట్‌లు ఎదురవుతున్నాయి. అసలు వచ్చే ఎన్నికల్లో పరిటాల ఫ్యామిలీకి ఏ సీటు వస్తుందో క్లారిటీ లేకుండా పోయింది. ఉండటానికి పరిటాల ఫ్యామిలీ చేతిలో రెండు సీట్లు ఉన్నాయి. రాప్తాడు, ధర్మవరం సీట్లు పరిటాల ఫ్యామిలీ చేతిలో ఉన్నాయి. రెండు నియోజకవర్గాల్లో టీడీపీ బాధ్యతలు శ్రీరామ్ చూసుకుంటున్నారు. అయితే రాప్తాడులో సునీతమ్మ, ధర్మవరంలో శ్రీరామ్‌లు పోటీ చేస్తారనే ప్రచారం ఉంది.

paritala-sri-ram

కానీ ఇక్కడే కొత్త ట్విస్ట్ వచ్చింది. గతంలో టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ..మళ్ళీ టీడీపీలోకి వచ్చి ధర్మవరంలో పోటీ చేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. అబ్బే లేదు..ఆ సీటు తనదే అని శ్రీరామ్ అంటున్నారు. ఒకవేళ సీటు ఇవ్వకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా మాట్లాడారు. అయితే ధర్మవరం సీటు గోనుగుంట్లకే ఇస్తారని, శ్రీరామ్‌ని రాప్తాడు బరిలో నిలబెడతారని ప్రచారం జరుగుతుంది. కానీ ఇంతవరకు సీట్లలో విషయంలో క్లారిటీ లేదు.

ఇదే సమయంలో ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డిపై పోరాడుతున్న శ్రీరామ్…అటు రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై కూడా ఫైట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా..ప్రకాశ్‌పై పరిటాల ఫైర్ అయ్యారు. రాప్తాడులో ఎమ్మెల్యే తోపుదుర్తి అక్రమ సంపాదనలతో ఆస్తులు కూడబెట్టుకుంటున్నారని పరిటాల ఆరోపించారు. దీనికి ప్రకాశ్ కౌంటర్ ఇచ్చారు. ఎవరు అక్రమాలు చేశారో జనాలకు తెలుసని, తాను అన్నీ నిజాయితీగా సంపాదించిన ఆస్తులని మాట్లాడిన ప్రకాశ్… ముందు అసలు తనపై రాప్తాడులో ఎవరు పోటీ చేస్తారో చెప్పాలని పరిటాలని ప్రశ్నించారు.

అంటే అసలు పరిటాల ఫ్యామిలీకి ఏ సీటు వస్తుందో క్లారిటీ లేదన్నట్లు కౌంటర్ ఇచ్చారు. వాస్తవానికి చూస్తే పరిస్తితి కూడా అలాగే ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు అయిన త్వరగా పరిటాల ఫ్యామిలీ సీట్ల విషయం తేల్చేస్తే బెటర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version