టాలీవుడ్ లో ఉన్న అగ్రహీరోలు అంతా వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు సెగలు పుట్టిస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి మరియు బాలకృష్ణలు అలుపెరగకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ఈ మధ్యనే వీరసింహారెడ్డి తో బాక్స్ ఆఫీస్ వద్ద విజృంభించగా, తాజగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో భగవంత్ కేసరి అన్న భిన్నమైన టైటిల్ తో ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబవుతున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ ను చిత్ర బృందం కాసేపటి క్రితమే తెలియచేసింది.. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను “గణేష్ ఆంథం” ఫుల్ లిరికల్ సాంగ్ ను రేపు సాయంత్రం 5 .06 గంటలకు చిత్ర బృందం విడుదల చేయనుంది.
బాలయ్య “భగవంత్ కేసరి” నుండి క్రేజీ అప్డేట్ …!
-