వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంకో అప్డేట్..!

-

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ని ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయి. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన కస్టమర్లకు వరుస అప్డేట్లని ఇస్తోంది కొత్త కొత్త ఫీచర్ల అని కూడా తీసుకు వస్తోంది. ఇప్పటిదాకా రెండు మిలియన్ మంది వాట్సాప్ ని వాడుతున్నారు. వినియోగదారులు వాట్సాప్ నుండి థర్డ్ పార్టీ యాప్స్ తో చాట్ చేయగలుగుతారు ఈ ఫీచర్ కనుక వచ్చిందంటే థర్డ్ పార్టీ యాప్ లతో చాటింగ్ చేయడానికి అవుతుంది.

ఒకసారి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక వాట్సాప్ నుండి ఇంకా ఏదైనా మెసేజ్ యాప్ కి మెసేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. యూరోపియన్ యూనియన్ డిజిటల్ మార్కెట్ చట్టం తీసుకువచ్చిన ఒత్తిడితో ఈ ఫీచర్ ని మార్చి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని వార్తలు వస్తున్నాయి. ఈ ఫీచర్ మొదట అందుబాటులోకి వస్తే ఫొటోస్ వాయిస్ మెసేజ్ వీడియోలు ఫైల్స్ ని పంపించుకోగలుగుతారు. కాల్ గ్రూప్ చాట్ లు వంటివి తర్వాత జోడిస్తారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version