బ్రిటన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కొత్త కరోనా వైరస్ మరో రెండు దేశాల్లో అడుగు పెట్టింది. ఇజ్రాయెల్, ఉత్తర ఐర్లండ్‌లలో కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా కొత్త వైరస్ లక్షణాలు బయట పడుతున్నాయి. ఇజ్రాయెల్‌లోఅనుమానం ఉన్న నలుగురికి పరీక్షలు చేయగా వారిలో కొత్తరకం వైరస్ బయట పడింది. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ వారిని ఎవరినీ కలవకుండా ఓ హోటల్‌లోని గదుల్లో ఉంచి చికిత్స నిర్వహిస్తుంది. వారు ఎవరెవరిని కలిశారో ఆ విరాలు సెకరిస్తూ వారిని సైతం పరీక్షలకు పిలుస్తున్నారు. పాత కరోనాతోనే సతమతమవుతున్న తరుణంలో ఈ కొత్తరకం వైరస్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని ఆ దేశ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ మాత్రం అనారోగ్య సమస్యలు తలెత్తినా ఇది.. పాత వైరస్సా..? లేక కొత్తవైరస్సా..? అనే ప్రశ్నాలతో తికమక పడుతున్నారు. ఉత్తర ఐర్లండ్‌లో కూడా ఓ కేసు నమోదనట్లు తెలిసింది.
మరణాల రేటు ఇలా..
మన దేశంలో మరణాల రేటు దగ్గుతుంది. గత 12 రోజులుగా 400 లోపు నమోదయ్యాయి. ఈ మేరకు క్రీయశిల కేసులు 2.80 శాతం ఉండగా, రికవరీ 95.75 శాతం ఉన్నట్లు తెలిసింది. కేరళలో కేసుల నమోదు మహారాష్ట్రలో మరణాల రేటు ఏమాత్రం తగ్గలేదు. ఈ రెండు విషయాల్లో ఆ రెండు రాష్ట్రాల్లో తప్పిస్తే అన్ని రాష్ట్రాల్లో రోజూ 2 వేల లోపే కేసులు రాగా, సగానికి సగం మరణాలు తగ్గిపోయాయి. గత 24 గంటల్లో ఆరు రాష్ట్రాల్లో ఒక్క మరణం కూడా లేదు. నవంబర్‌లో కరోనా కేసులతో ఆందోళన కలిగించిన ఢిల్లి ప్రస్తుతం రోజువారి కేసుల్లో 10 స్థానంలో ఉంది.