బీజేపీ దీక్ష చేస్తే ఓమిక్రాన్ గుర్తుకు వచ్చింది… అర్థరాత్రి వరకు బార్లు తెరిస్తే ఓమిక్రాన్ రాదా..? – బండి సంజయ్.

-

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు కురిపించారు. బీజేపీ దీక్ష చేస్తా అంటే ఓమిక్రాన్ వస్తుంది కానీ.. అర్థరాత్రి దాకా బార్లు తెరిస్తే రాదా… అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా అర్థరాత్రిదాకా బార్లకు అనుమతులు ఇచ్చారని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రాత్రి బార్లు.. తెల్లారితే దర్బార్ అని ఎద్దేవా చేశాడు. రాత్రి 12 గంటల వరకు బార్లకు అనుమతి ఇచ్చాడని..బీజేపీ దీక్ష అంటే రాత్రికిరాత్రి జీవోలు రిలీజ్ చేశాడని విమర్శించారు. ప్రభుత్వం తాగు ఊగు అని బంఫర్ ఆఫర్ ప్రకటించిందని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మద్యం కలెక్షన్లపైనే ఎక్కువ శ్రద్ధ ఉందని దుయ్యబట్టారు. కలెక్షన్లు అంటే సీఎం కేసీఆర్ కు ఓమిక్రాన్ గుర్తుకురాదని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిది ఏ పాలసీ అని.. రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ఆయన ఓమిక్రాన్ ఉందని జాగ్రత్తగా ఉండాలని అంటారు… ఆయనే అనుమతులు ఇస్తారని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version