సూపర్ స్టార్ సూపర్ హిట్ ఫిల్మ్‌కు 30 ఏళ్లు..దర్శకుడితో రజనీకాంత్..

-

స్టైల్ కు కేరాఫ్, తమిళ్ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రజెంట్..‘బీస్ట్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ ఫిల్మ్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ వారు ఈ పిక్చర్ ప్రొడ్యూస్ చేస్తుండగా అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇందులో వెరీ స్టైలిష్ గా రజనీని దర్శకుడు నెల్సన్ చూపించబోతున్నాడు. ఈ సంగతులు పక్కనబెడితే..రజనీ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘అన్నామలై’ 30 ఏళ్లు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా ‘అన్నామలై’ చిత్ర దర్శకుడు సురేశ్ కృష్ణ రజనీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఇందులో హీరోయిన్ గా ఖుష్బు నటించింది. దేవా మ్యూజిక్ అందించిన ఈ ఫిల్మ్ కు నిజానికి వసంత్ దర్శకత్వం వహించాల్సిదట. కానీ, సురేశ్ కృష్ణ దర్శకత్వం వహించారు.

ఇక ఆ తర్వాత రజనీ కాంత్ – సురేశ్ కృష్ణ కాంబినేషన్‌లో ‘వీరా’, ‘బాషా’ వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. రజనీ నటించిన ‘బాషా’ రిలీజ్ ముందు వరకు ‘అన్నామలై’ ఆల్‌టైమ్‌ ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం విశేషం. ఈ చిత్రాన్ని తెలుగులో టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్ ‘కొండపల్లి రాజా’గా రీమేక్ చేశారు. అయితే, తెలుగులో అనుకున్న స్థాయిలో ఈ సినిమా ఆడలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version