‘తలపతి 66’లో వంశీ పైడిపల్లి మ్యాజిక్..స్టోరిపై విజయ్, దిల్ రాజు ధీమా!

-

టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి..చేసింది కొన్ని సినిమాలే అయినా తనకంటూ ఓ స్టైల్ ఏర్పరుచుకున్నాడు. తొలి సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. కానీ, తర్వాత సినిమాల ద్వారా తానేంటో నిరూపించుకున్నాడు. అలా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన పిక్చర్ ‘బృందావనం’. ఈ మూవీ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు.

ఇలా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం సినిమాలు తీయడంలో దిల్ రాజు ఎప్పుడూ ముందుంటాడు. ఇక..వంశీ పైడిపల్లి ..‘మహర్షి’ సినిమాతో మహేశ్ బాబును డైరెక్ట్ చేసి..ఆ చిత్రానికి నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

‘తలపతి 66’ మూవీపైన దిల్ రాజు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ పిక్చర్ స్టోరి విని విజయ్ ఫిదా అయ్యారని దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ చిత్రం తమిళ్ భాషలోనే తెరకెక్కుతుండగా, తెలుగులోనూ విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమా ఫ్లేవర్ ‘బృందావనం’ స్టైల్ లో ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.

ఇటీవల శ్యామ్ ను ఈ సినిమాలోకి తీసుకున్నట్లు మేకర్స్ తెలిపారు. రష్మిక మందన హీరోయిన్, కాగా, డెఫినెట్ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించేలా ఉండబోతున్నదని తెలుస్తోంది. విజయ్ గత చిత్రాలన్నీ కూడా మాస్ ప్లస్ యాక్షన్ ఓరియెంటెడ్ ఉన్న నేపథ్యంలో ఈ సారి ఫ్యామిలీ సైడ్ కు ఆయన షిఫ్ట్ అవుతారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version