బాబు మార్క్ యూ ట‌ర్న్‌కు మ‌ళ్లీ రెడీ…!

-

చంద్రబాబు స్వరం మారింది. నాలుగు నెలల కాలంలోనే ఆయ‌న పూర్తిగా యూ టర్న్ తీసుకున్నారు. మొ న్న‌టి వ‌ర‌కు కేంద్రంలోని బీజేపీపై ఒంటికాలిపై లేచిన బాబు వైఖ‌రిలో ఇప్పుడు మార్పు క‌నిపిస్తోంది. క మలం పార్టీతో క‌య్యానికి వెళ్లి పూర్తిగా న‌ష్ట‌పోయామ‌ని బాబు గ్ర‌హించారు. కేంద్రం ప్రత్యక్షంగానో, పరో క్షంగానో సహకరిస్తే తప్ప రాష్ట్రప్రభుత్వంపై పోరాటం చేసే సత్తువ కూడా కోల్పోయిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇక బీజేపీ అధినాయకత్వంతో పూర్తిస్థాయి సంబంధాల పునరుద్ధరణపై దృష్టిసారించారు.

రాజకీయమంటే అవసరాలకు అనుగుణంగా అభిప్రాయాలు మార్చుకోవడమనే కళను చంద్రబాబు పూర్తిగా వంటబట్టించుకున్నారు. ఈనేప‌థ్యంలోనే మూడోసారీ కమలం పార్టీతో కలవడం తప్పనిసరి అవసరమనే భావనను క్యాడ‌ర్‌లో నూరి పోస్తున్నారు చంద్ర‌బాబు. బీజేపీతో విరోధం పెట్టుకుని తప్పు చేశామని బహిరంగంగానే అంగీక రిస్తున్నారు. ఎన్నికలకు ముందు మోడీ పైన, బీజేపీపైన విరుచుకుపడిన క్యాడర్ మళ్లీ కమలం పార్టీని కీర్తించాల్సిన అవసరం ఉందని ఉద్బోదిస్తున్నారు.

1998 నుంచి 2004 వరకూ టీడీపీ బీజేపీని బలపరిచింది. కార్గిల్ యుద్ధంతో వ‌చ్చిన మైలేజ్ బీజీపీకి బాగా ఉప‌యోగ‌ప‌డ‌గా, టీడీపీ కూడా దాన్ని అవ‌కాశంగా మ‌లుచుకుంది. 2004లో బీజేపీ కారణంగా పెద్దగా ప్రయోజనం లభించక‌పోడంతో వెంటనే చంద్రబాబు స్టాండ్ మార్చుకున్నారు. 2009 నాటికి వామపక్షాలు, టీఆర్ఎస్ తో చేయి కలిపారు. మళ్లీ 2014 వచ్చేసరికి కమలం పార్టీని చంద్రబాబు ఆశ్రయించారు. ఫలితం సాధించారు. 2019 కి మళ్లీ కొత్త పంథాను అనుసరించారు.

వైసీపీ అధినేతపై కేంద్ర దర్యాప్తు సంస్థల చర్యల విషయంలో బీజేపీ దూకుడు కనబరచకపోవడంతో చంద్రబాబు తీవ్రంగా అసంతృప్తికి లోనయ్యారు. బీజేపీని, వైసీపీని ఒకే గాటన కట్టి ప్రత్యేక హోదా సెంటిమెంటు రగిలించడం ద్వారా మరోసారి రాష్ట్రంలో అధికారం ద‌క్కించుకోవాల‌నుకున్నారు చంద్రబాబు. ఆ ప్రయత్నమూ విఫలమై, ఘోర పరాజయం త ర్వాత తాజాగా వాస్తవాలను ఒక్కటొక్కటిగా గ్రహిస్తున్నారు. వాటిని మళ్లీ దిద్దుకోవాలని ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు.

కేంద్రంతో విభేదించి టీడీపీ నష్టపోయింద‌ని, రాష్ట్రానికి ఒరిగిందీ లేద‌ని విశాఖపట్నంలో కార్యకర్తలతో చంద్రబాబు తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం. అయితే బీజేపీతో మైత్రి వ‌ల్ల రెండు ప్ర‌యోజనాలను ఆయన ఆశిస్తున్నారు. పార్టీని వీడి వెళ్లిపోతున్న నాయకులను కొంతమేరకు ని యంత్రించొచ్చ‌ని, భవిష్యత్తులో బీజేపీతో టీడీపీ కలుస్తుందనే సంకేతాల ద్వారా వేచి చూసే ధోరణిలో వలసలకు అడ్డుకట్ట పడుతుందని చంద్రబాబు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version