గ‌న్న‌వ‌రంలో టీడీపీకి క్యాండెట్ క‌రువు… ఆ ముగ్గురు చేతులు ఎత్తేసిన‌ట్టే..!

-

కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం టీడీపీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీమోహ‌న్ హై డ్రామా ఇంకా కొన‌సాగుతూనే ఉంది. త‌న ఎమ్మెల్యే ప‌ద‌వితో పాటు పార్టీకి రాజీనామా చేసిన వంశీని బాబు ఒక‌టిరి రెండుసార్లు బుజ్జ‌గించారు. ఆ త‌ర్వాత పార్టీ నేత‌ల‌ను సైతం బ‌తిమిలాడారు. ఆ త‌ర్వాత ఈ వ్య‌వ‌హారం సైలెంట్ అయ్యింది. ఇక వంశీ ఇప్ప‌టికే వైసీపీలో చేరిపోవాల్సి ఉన్నా ఆయ‌న జ‌గ‌న్ ముందు పెట్టిన కోరిక‌ల చిట్టాపై జ‌గ‌న్ హామీ ఇవ్వ‌క‌పోవ‌డంతోనే వంశీ వైసీపీ ఎంట్రీ వాయిదా ప‌డిన‌ట్టు టాక్‌…?

తెలంగాణ‌లోనూ, ఏపీలోనూ త‌న‌కు ఉన్న వివాస్ప‌ద ఆస్తులను ఆ వివాదాల నుంచి బ‌య‌ట పడేయాల‌న్న వంశీ కండీష‌న్‌కు జ‌గ‌న్ ఓకే చెప్ప‌క‌పోవ‌డంతోనే వంశీ వైసీపీ ఎంట్రీ లేట్ అయిన‌ట్టు టాక్‌..? వంశీ విష‌యంలో జ‌గ‌న్ ఓకే చెపితే ఇలాంటి ఆస్తులు ఉన్న వైసీపీ నేత‌లు చాలా మందే ఉన్నారు. మ‌రి వారి ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ఆలోచించే జ‌గ‌న్ ఈ విష‌యంలో వంశీకి హామీ ఇవ్వ‌లేదంటున్నారు.

ఇక వంశీ రేపో మాపో అయినా పార్టీ మారేందుకే రెడీ అవుతున్నాడు. ఈ క్ర‌మంలోనే వంశీ పార్టీ మారితే గన్నవరంలో ఉప ఎన్నిక వస్తుందన్నది తెలిసిందే. అప్పడు అక్కడ టీడీపీ నుంచి పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి కూడా దొరికే పరిస్థితి లేదు. నిన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డ మాజీ మంత్రి దేవినేని ఉమా, దేవినేని అవినాష్‌, జిల్లా ప‌రిష‌త్ మాజీ చైర్‌ప‌ర్స‌న్ గ‌ద్దె అనూరాధ రేసులో ఉన్నారు.

అయితే ఇప్పుడు వీరు ముగ్గురు పోటీ చేసేందుకు ఆస‌క్తి చూప‌డం లేద‌ట‌. అనూరాధ దంప‌తులు మొన్నే తాము ఎన్నిక‌ల‌కు వెళ్లామ‌ని.. ఇప్పుడు పోటీ చేయ‌మ‌ని చెప్ప‌గా…. గుడివాడ‌లో కోట్లాది రూపాయ‌లు పోగొట్టుకున్న అవినాష్ ముందే చేతులు ఎత్తేశాడ‌ట‌. అవినాష్ మళ్లీ నియోజకవర్గం మారితే పెనమలూరు లేదా విజయవాడ తూర్పు మీదే ఆసక్తితో ఉన్నారే తప్పా గన్నవరంలో ఆయన పోటీకి ఇష్టపడడం లేదు.

ఇక దేవినేని ఉమాకు గ‌న్న‌వ‌రంలో సొంత పార్టీలోనే కావాల్సినంత వ్య‌తిరేక‌త ఉంది. ఉమాను స్థానిక టీడీపీ కేడ‌ర్ కొన్ని సంవ‌త్స‌రాల నుంచే వ్య‌తిరేకిస్తోన్న ప‌రిస్థితి. ఈ క్రమంలోనే గ‌న్న‌వ‌రంలో ఉప ఎన్నిక వ‌స్తే ఇలాంటి బ‌ల‌మైన అభ్య‌ర్థులే చేతులు ఎత్తేస్తే ఇక టీడీపీకి క్యాండెట్ కొర‌త త‌ప్ప‌ని ప‌రిస్థితి.

Read more RELATED
Recommended to you

Exit mobile version