ఏపీ వాసులకు గుడ్‌ న్యూస్‌..కర్ఫ్యూ ఆంక్షలు వేత్తివేత

-

ఏపీ వాసులకు గుడ్‌ న్యూస్‌ జగన్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఏపీలో కర్ఫ్యూ ఆంక్షలకు సడలింపు ఇచ్చింది జగన్‌ ప్రభుత్వం. సంక్రాంతి తర్వాతి నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వుల్లో సవరణ చేసింది ప్రభుత్వం. పండగ సమయంలో పట్టణాల నుంచి పెద్ద ఎత్తున పల్లెలకు ప్రజలు తరలి వస్తున్నారు. దీంతో ఏపీలో కర్ఫ్యూ ఆంక్షలకు సడలింపు ఇచ్చింది జగన్‌ ప్రభుత్వం.

తరలి వస్తున్న ఈ నేపథ్యంలోనే ఎన్ని వేవ్ లు వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. నిన్న ముఖ్యమంత్రి కోవిడ్ పరిస్థితుల పై సమగ్రంగా సమీక్షించారని మంత్రి ఆళ్లనాని పేర్కొన్నారు. రెండో వేవ్ సందర్భంగా ఆక్సిజన్ కొరతతో చాలా ఇబ్బందులు పడ్డామని.. ఈ నేపథ్యంలోనే 144 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ముఖ్యమంత్రి ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రజలు కూడా కోవిడ్ నివారణ, కట్టడిలో భాగస్వామ్యం కావాలని…. ప్రభుత్వ చేస్తున్న నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

ప్రజల సహకారంతోనే కోవిడ్ ను సమర్ధవంతంగా ఎదుర్కోగలమని.. మాస్క్ ధరించాలన్న ఆంక్షలు కఠినంగా అమలు చేయనున్నామని వెల్లడించారు. సంక్రాంతి పండుగ సమయంలో రాత్రి కర్ఫ్యూ వల్ల ఇబ్బంది అనే అంశం ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిందని.. అందుకే రాత్రి కర్ఫ్యూ అమలు లో సడలింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ నెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు లోకి వస్తుందని ఆయన వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version