నిమ్మగడ్డ ఖచ్చితంగా చదవాల్సిన వార్త ఇది!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఖచ్చితంగ చదవాల్సిన అంశం, తెలుసుకోవాల్సిన అంశం ఇది! ఏ కరోనా పేరుచెప్పి ఎన్నికలను వాయిదా వేశారో.. అదే కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఎన్నికలు నిర్వహించాలని తపిస్తున్నారు. సరే ఆయన వ్యక్తిగత కారణాలు ఆయనకు ఉండొచ్చు కానీ… ప్రజల ఆరోగ్యం బాధ్యత ప్రభుత్వానిది కదా! అయితే తాజాగా బ్రిటన్ లోని పరిస్థితులు ఇప్పుడు నిమ్మగడ్డ తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది!

అవును… గత ఏడాది చైనా లో వుహాన్ సిటీలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ .. చైనా నుండి ఒక్కొక్క దేశానికి విస్తరించిన ఈ మహమ్మారి ప్రపంచం మొత్తం వ్యాపించిన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలన్నీ ఆర్ధికంగా అల్లకల్లోలం అయిపోయిన పరిస్థితి ఈ కోవిడ్ సృష్టించింది! అయితే శీతాకాలంలో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నప్పటికీ.. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అని ఫిక్సయిపోతున్నారు ఏపీ ఎన్నికల కమిషనర్!

అయితే… ఇంపీరియల్ కాలేజీ లండన్ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం అక్టోబరు 16-25 మధ్య దేశవ్యాప్తంగా ప్రతి పదివేల మందిలో 128 మందికి కరోనా ఉన్నట్లుగా తేలగా.. అక్టోబరు మొదటివారంలో ఈ సంఖ్య కేవలం 60 మాత్రమే! అంటే… నవంబర్ – డిసెంబర్ నెలల్లో ఈ పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు! ఏపీ ప్రభుత్వం కంగారు పడుతున్న అంశం కూడా ఇదే!

అయితే.. ఈ విషయాలు వారూ వీరూ కంటే ముందుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుసు కోవాలనేది ఇక్కడ ప్రధానాంశంగా ఉంది! మొదటి సారి కరోనా వ్యాధి వ్యాపించిన సమయంలో కంటే సెకండ్ వేవ్ లోనే మరణాల సంఖ్య భారీగా నమోదు అవుతుంది. చలికాలం కావడంతో మహమ్మారి తీవ్రత భారీగా పెరిగే అవకాశం ఉందని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు! మరి ఈ హెచ్చరికలు వింటారా రమేష్ కుమార్ గారు అని ఏపీ వాసులు ప్రశ్నిస్తున్నారు!

Read more RELATED
Recommended to you

Exit mobile version