హైదరాబాద్ లో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్…?

-

హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. కంట్లూరు రాజీవ్ గృహకల్ప లో నివాసం ఉండే ఇద్దరు చిన్నారులు కనపడకుండా పోయారు. నిన్న రాత్రి కుటుంబ సభ్యులతో ఉన్న చిన్నారులు ప్రేమ(11) మరియు శ్రీపాల్(13) లు ఉదయం లేచేసరికి కనిపించలేదు. దీనితో తల్లి సౌమ్య ఫిర్యాదు చేసారు. వారి ఆచూకీ ఇంకా లభించలేదు.

స్థానిక సీసీ కెమెరాల ఆధారంగా ఎక్కడైకి వెళ్లారు అని పోలీసులు పరిశీలిస్తున్నారు. తమకు ఎవరి మీద అనుమానం లేదు అని తల్లి తండ్రులు చెప్తున్నారు. అయితే తల్లి తండ్రుల నుంచి పిల్లలకు ఏమైనా ఇబ్బందులు ఉండవచ్చా అనే కోణంతో పాటుగా కిడ్నాప్ మీద కూడా అనుమానం వ్యక్తమవుతుంది. మిస్సింగ్ కేస్ నమోదు చేసుకుని నాలుగు బృందాలుగా దర్యాఫ్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version