తాజాగా BRS అధిష్టానం తీసుకున్న నిర్ణయం వలన పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి మరియు జూపల్లి కృష్ణారావులను పార్టీ నుండి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన కారణంగానే సస్పెన్షన్ వేటు వేశారని ఆ పార్టీ నాయకులు క్లారిటీ ఇస్తున్నారు. కాగా ఈ విషయంపై తాజాగా మంత్రి నిరంజన్ రెడ్డి సస్పెండ్ అయిన నాయకులపై ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ సీనియర్ నాయకులను కూడా కాదని, పొంగులేటి మరియు జూపల్లి కృష్ణారావు లకు పార్టీలో అధిక ప్రాధాన్యత ఇచ్చినా… వీరికి అర్ధం కాలేదన్నారు.
పొంగులేటి & జూపల్లి కృష్ణారావులు BRS ద్రోహులు… : మంత్రి నిరంజన్ రెడ్డి
-