పనిచేసే ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉంటాయి : నిరంజన్‌ రెడ్డి

-

రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చొరవతో రాష్ట్ర ప్రభుత్వం వనపర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల నిమిత్తం భారీగా నిధులు మంజూరు చేయడం జరిగింది. నియోజకవర్గంలోని వివిధ రకాల పనుల కోసం మొత్తం రూ.147.30 కోట్లు మంజూరు చేయించడం జరిగిందని, నియోజకవర్గంలో అవసరమైన ప్రతి పని పూర్తి చేయడానికి తాను నిరంతరం కృషి చేస్తానని మంత్రి నిరంజన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూతనందిస్తుందని, సబ్బండ వర్గాలు సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాసం వద్ద మహబూబ్‌నగర్‌ జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు మంత్రి సమక్షంలో 55 మంది బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version