లోకేశ్‌ ముందు కనీళ్లు పెట్టుకున్న ఉండవల్లి శ్రీదేవి

-

చాలా రోజులనుండి ఉండవల్లి శ్రీదేవి టీడీపీ వర్గాలకు సన్నిహితంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై వైసీపీ అధినాయకత్వం సస్పెండ్ చేసినవారిలో ఉండవల్లి శ్రీదేవి కూడా ఒకరు. నేడు ఉండవల్లి శ్రీదేవి నారా లోకేశ్ కార్యక్రమానికి హాజరవడంతో వచ్చే ఎన్నికల్లో ఆమె ఏ పక్షమో స్పష్టంగా తెలిసిపోయింది.

ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర తాడికొండ నియోజకవర్గంలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర పరిణామం జరిగింది. అమరావతి ఆక్రందన పేరిట లోకేశ్ అమరావతి రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించగా, ఈ కార్యక్రమానికి వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా హాజరవచ్చారు. సొంత నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఆమే సంధానకర్తగా వ్యవహరించడం విశేషం.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version