మళ్ళీ సుప్రీం కోర్ట్ కి నిందితులు, ఉరి వాయిదా…?

-

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ నిర్భయ కేసులో దోషిగా ఉన్న ముఖేష్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. నిర్భయ గ్యాంగ్‌రేప్ కేసులో దోషి ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్‌ను జనవరి 17 న అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించిరిన సంగతి తెలిసిందే. కోర్ట్ ఉత్తర్వుల ప్రకారం ఈ నలుగురుని ఫిబ్రవరి 1 ఉదయం ఆరు గంటలకు ఉరి తీయనున్నారు.

ఇదిలా ఉంటే తిహార్ జైలు అధికారుల తరఫున హాజరైన పబ్లిక్ ప్రాసిక్యూటర్, దోషులు “ఉరి శిక్షను ఆలస్యం చేసే వ్యూహాలను” సిద్దం చేస్తున్నారని ఆరోపించిన కొద్ది గంటలకే ఈ పరిణామం చోటు చేసుకుంది. అక్షయ్ కుమార్ సింగ్ (31), పవన్ సింగ్ (25) లకు నివారణ పిటిషన్లు దాఖలు చేయడానికి అవసరమైన పత్రాలను జైలు అధికారులు ఇంకా విడుదల చేయలేదని ఆరోపిస్తూ న్యాయవాది ఎపి సింగ్ పిటీషన్ దాఖలు చేసారు.

ఆయన పాటియాలా హౌస్ కోర్టును ఆశ్రయించారు. వినయ్, ముఖేష్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్లను ఇటీవల సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. క్షమాభిక్ష పిటీషన్ ని దాఖలు చేయడానికి అవసరమైన కొన్ని పత్రాలను జైలు అధికారులు అందించడం లేదని కోర్ట్ కి వెళ్ళగా, ఆ పిటీషన్ ని కోర్ట్ కొట్టేసింది. సంబంధిత పత్రాలు అన్నీ జైలు అధికారులు ఇస్తున్నారని, శిక్షను ఆలస్యం చేయడానికే ఈ విధంగా చేస్తున్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్ట్ కి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version