వాటాల గొడవ కంటిన్యూ…నిర్మలా లెక్క.. టీఆర్ఎస్ లాజిక్..!

-

తెలంగాణని కైవసం చేసుకోవాలని బీజేపీ గట్టిగా ట్రై చేస్తుంది…ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు. అదే సమయంలో తమని టార్గెట్ చేసిన బీజేపీని కేంద్ర స్థాయిలోనే దెబ్బకొట్టాలనేది కేసీఆర్ ప్లాన్. ఇది కూడా వాస్తవమే. ఇలా రెండు పార్టీల మధ్య రగడ పెద్దగా నడుస్తోంది. ఇప్పటికే తెలంగాణపై బీజేపీ నేతలు ఫోకస్ చేసి రాజకీయం చేస్తున్నారు. రాష్ట్ర నేతలు కేసీఆర్ ప్రభుత్వంపై దూకుడుగా వెళుతున్నారు…వారికి మద్ధతుగా కేంద్రం పెద్దలు కూడా రంగంలోకి దిగి రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నారు.

ఇదే సమయంలో కేసీఆర్ సైతం జాతీయ స్థాయిలో బీజేపీకి చెక్ పెట్టాలని చెప్పి తిరుగుతున్నారు. బీజేపీకి యాంటీగా ఉన్న పార్టీలని ఏకం చేయాలని చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. ఇలా ఇరు పార్టీల మధ్య పెద్ద రచ్చే నడుస్తోంది. ఇక జాతీయ స్థాయిలో తమని టార్గెట్ చేస్తున్న కేసీఆర్‌ని మరింత ఇరుకున పెట్టడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది.

ఇదే క్రమంలో తెలంగాణలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎంట్రీ ఇచ్చి…రాష్ట్రం ఇచ్చే పథకాలలో కేంద్రం వాటా ఎంత అనే లెక్కలు తేలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కామారెడ్డి జిల్లా పర్యటనలో రేషన్ బియ్యం విషయంలో పంచాయితీ పెట్టారు. అలాగే రేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఎక్కువని లెక్కలు చెప్పారు. అలాగే రేషన్ దుకాణాల వద్ద మోదీ ఎందుకు పెట్టలేదని ఏకంగా జిల్లా కలెక్టర్‌పైనే ఫైర్ అయ్యారు.

ఇక నిర్మలా ఇలా మాట్లాడక..టీఆర్ఎస్ నేతలు ఎందుకు ఊరుకుంటారు..వెంటనే మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇక ఆయన లాజిక్ ఆయన చెప్పారు. అసలు రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే బియ్యం వాటా 55 శాతమే అని, 45 శాతం రాష్ట్రం భరిస్తుందని చెప్పారు. ఇక దేశాన్ని పోషిస్తున్న ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి అని కౌంటర్ ఇచ్చారు. ఆ వెంటనే మళ్ళీ నిర్మలా…టీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు…తాను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఎదురుదాడి చేస్తున్నారని మాట్లాడి..తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, పలు ప్రాజెక్టుల భూ నిర్వాసితుల గురించి మాట్లాడి టీఆర్ఎస్ ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు.

అయితే నిర్మలాకు మద్ధతుగా రాష్ట్ర బీజేపీ నేతలు సైతం…టీఆర్ఎస్ సర్కార్‌పై విరుచుకుపడుతున్నారు. అటు టీఆర్ఎస్ నేతలు సైతం నిర్మలాపై ఫైర్ అవుతున్నారు. మంత్రులు హరీష్, కేటీఆర్ సైతం తనదైన శైలిలో మాట్లాడుతూ కౌంటర్లు ఇస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రధానులు ఉన్న సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఫోటోలు పెట్టుకున్నారని ప్రశ్నిస్తున్నారు. అలాగే రాష్ట్రం అప్పులు గురించి మాట్లాడుతున్నారు…అసలు ప్రధాని మోదీ ఎంత అప్పులు చేశారో చెప్పాలని… 67 ఏళ్లలో 14 మంది భారత ప్రధానులు కలిసి రూ.56 లక్షల కోట్ల అప్పు చేేస్త.. ఎనిమిదేళ్లలోనే ప్రధాని మోదీ రుణభారాన్ని రూ.100 లక్షల కోట్లకు పెంచారని ఫైర్ అవుతున్నారు.

ఇలా స్టేట్-సెంట్రల్ మధ్య వాటాల గొడవ నడుస్తోంది. అయితే ఎక్కడైనా స్టేట్-సెంట్రల్ కలిసికట్టుగా పనిచేయాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి పన్నుల రూపంలో లక్షల కోట్లు చెల్లిస్తాయి. అలాగే కేంద్రం…రాష్ట్రాలకు పథకాల రూపంలో డబ్బులు ఇస్తాయి. ఇలా రెండు బ్యాలెన్స్‌గా నడవాలి. కానీ టీఆర్ఎస్-బీజేపీల మధ్య పోలిటికల్ పంచాయితీతోనే…ఈ వాటాల గొడవ రేగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version