మత్స్యకారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. బడ్జెట్‌లో రూ.6వేల కోట్లు

-

కేంద్ర ప్రభుత్వం మత్స్యకారులకు శుభవార్త చెప్పింది. నేడు పార్లమెంట్‌ సమావేశాల్లో బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్‌ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మత్స్యశాఖకు రూ.6వేల కోట్ల నిధులు కేటాయించినట్లు ప్రకటించారు. మత్స్యకారుల అభివృద్దికి కట్టుబడి ఉన్నామన్నారు. సహకారం ద్వారానే సమృద్ధి సాధిస్తాం అన్నారు. పీఏసీఎస్ ని మరింత అభివృద్ది చేస్తున్నామని ఆమె వెల్లడించారు. సహకార సంఘాలను ప్రగతి పథంలో నడిపిస్తామని నిర్మలా వ్యాఖ్యానించారు. క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాంలకు 2 వేల కోట్లు కేటాయించామని నిర్మలా సీతారామన్‌ అన్నారు. మహిళ కోసం మరిన్ని పథకాలు ప్రారంభిస్తున్నామని, నర్సింగ్ కాలేజీలు ప్రారంభించామన్నారు. ఇవన్నీ కోర్ లొకేషన్ లో ఏర్పాటుచేశామని, సింగిల్ సెల్ ఎనీమియా నివారణకు కట్టుబడి ఉన్నామన్నారు.

0-40 ఏళ్ళ వారికి ముఖ్యంగా గిరిజనులకు మంచి ఆహారం అందిస్తామని, ఐసీయంఆర్ ల్యాబ్ లు ఏర్పాటుచేస్తున్నామన్నారు. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కు ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రాధాన్యతా రంగాలకు సంబంధించి మరిన్ని నిధులు అందిస్తామన్నారు. టీచర్ల ట్రైనింగ్ ఇస్తున్నామని, ఐసీటీ అమలు చేస్తున్నామని, యువతీ యువకుల కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుచేస్తున్నామన్నారు. గిరిజనులకు వివిధ సౌకర్యాలు కల్పించాలని 50 వేల కోట్లు కేటాయించాం. షెడ్యూల్ తెగలకు సాయం అందిస్తాం.ఏకలవ్య స్కూళ్ళలో 38,800 టీచర్లను 740 స్కూళ్లో నియమిస్తున్నాం. పీఎం ఆవాజ్ యోజన పెంచాం. జైళ్ళలో ఉండే పేద ఖైదీలకు బెయిల్ పొందేందుకు సాయం అందిస్తాం. వ్యవసాయంలో ఆధునీకరణకు కట్టుబడి ఉన్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version