మణిపూర్ అంశంపై విపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయి : నిర్మలా సీతారామన్‌

-

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను మణిపూర్ అంశం కుదిపేస్తుంది. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ పార్లమెంట్‌లో సమగ్ర ప్రకటన చేయాలని విపక్ష కూటమి ఇండియా డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఉభయసభలలో వాయిదాల పర్వం కొనసాగుతుంది. అయితే తాజాగా ఈ పరిణామాలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. మణిపూర్ అంశంపై చర్చకు దూరంగా విపక్షాలు పారిపోతున్నాయని విమర్శించారు. మణిపూర్ అంశంపై ప్రతిపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నారని.. చర్చలో పాల్గొనేందుకు ఇష్టపడటం లేదని మండిపడ్డారు.

మణిపూర్.. మణిపూర్ అని అరుస్తున్నారు తప్ప ఏం లేదన్నారు. అల్లర్లపై చర్చించాలని వారు అడిగారని, అందుకు తాము సిద్ధపడ్డామని, కానీ వారు చర్చకు ముందుకు రావడం లేదన్నారు. వారి ఉద్ధేశ్యం సభను అడ్డుకోవడమే అన్నారు. వారి ఆలోచన వారు వేసుకున్న తెల్ల దుస్తుల వలె ఉందన్నారు. అప్పట్లో ఏ హోంమంత్రి కూడా రాష్ట్ర పర్యటనకు వెళ్లలేదని, కానీ ప్రస్తుతం విషయం తెలిసిన వెంటనే అమిత్ షా మణిపూర్ లో మూడ్రోజుల పాటు పర్యటించారన్నారు. అమిత్ షా అక్కడి పరిస్థితులను పరిశీలించి, సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్న వారి వద్దకు వెళ్లి భరోసా కల్పించారన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version