పూరీ తీరంలో నిర్మలా సీతారామన్ సైకత శిల్పం.. వరుసగా ఎనిమిదోసారి!

-

ప్రధాని మోడీ సర్కారు 3.0లో వరుసగా ఎనిమిదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 1వ తేదీన 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్‌ను నేడు ప్రవేశపెట్టనున్నారు. వరుసగా 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా.. మొరార్జీ దేశాయ్ రికార్డు 10 సార్లుకు చేరువయ్యారు.

ఈ సందర్భంగా ఒడిశాలోని పూరి తీరంలో సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అద్భుతమైన సైకత శిల్పాన్ని రూపొందించారు.‘వెల్‌కం యూనియన్ బడ్జెట్ 2025′ అని పేర్కొంటూ నిర్మలా సీతారామన్ సైకతాన్ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ సైకత శిల్పం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా, కేంద్ర బడ్జెట్‌పై నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version