ఆరేళ్లుగా నిత్యామీనన్‌ కు వేధింపులు.. క్లారిటీ ఇదే

-

నిత్యా మీనన్‌..గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో పలు సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. బీమ్లా నాయక్‌ సినిమాతో మంచి ఫామ్‌ లోకి వచ్చింది. అయితే..తాజాగా నిత్యా మీనన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఆరేళ్లుగా ఓ వ్యక్తి వేధిస్తున్నాడని పేర్కొంది. నటుడు మోహన్‌లాల్‌ ఆరాట్టు సినిమా పేరుపై విశ్లేషణ చేయడం ద్వారా వెలుగులోకి వచ్చిన సంతోష్‌ వర్గీ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం చేసి ఇబ్బందులకు గురి చేశాడని వాపోయింది.

అయితే.. నిత్యా ఆరోపణలపై స్వయంగా సంతోష్‌ వర్గీ క్లారిటీ ఇచ్చేశాడు. నిత్యా ఆరోపణల్లో వాస్తవం లేదని, ఒకే వ్యక్తి పేరు మీద ఎన్ని సిమ్‌కార్డులు కొనగలడో జనాలకే వదిలేస్తున్నాడని చెప్పాడు. నిత్యామీనన్‌కు వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందని వాళ్ల తల్లి చెబితే, జరగలేదని తండ్రి చెప్పారు. అంతేకాకుండా వాళ్లు నాపై లైంగిక వేధింపుల కేసు కూడా పెట్టాలని చూస్తున్నారు. ‘గతంలో నిత్యామీనన్‌ అంటే తనకు ఇష్టం ఉండేది. తనను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా. కానీ ఇప్పుడు చచ్చినా ఆమెను పెళ్లిచేసుకోను. అసలు నిత్యామీనన్‌ గురించి ఇవన్నీ ముందే తెలిస్తే ప్రేమించి ఉండే వాడినే కాదు’. అంటూ కామెంట్స్‌ చేశాడు సంతోష్‌ వర్గీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version