తెలంగాణకు గుడ్ న్యూస్ : 13 వేల కోట్ల రూపాయలు రోడ్ ల ప్రారంభం

-

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మరియు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో 370 కిలోమీటర్ల విస్తీర్ణంతో రూ.3, 717 కోట్ల విలువైన 6 ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయటంతో పాటు 396 కిలోమీటర్ల పొడవున రూ.9, 440 కోట్ల విలువైన 8 ప్రాజెక్టులకు శంఖు స్థాపన చేశారు. నరేంద్రమోదీ నవ భారత నిర్మాణంలో భాగంగా, దేశంలో ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటున్నామని దీనిని సాకారం చేసుకోవడం కోసం ఈ 14 ప్రాజెక్టులు మరో ముందడుగా చెప్పవచ్చని గడ్కరీ పేర్కొన్నారు.

2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల పొడవు 2511 కి.మీ కాగా ఇప్పుడు 3,910 కి.మీ.కు పెరిగింది.   1,399 కి.మీ మేర (55.71%) నమోదైన ఈ పెరుగుదల కేంద్ర ప్రభుత్వ సంకల్పాన్ని  ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు.   భూమి పూజ జరిగిన ఎనిమిది ప్రాజెక్టులు, రూ. 9,440 కోట్ల వ్యయం, 396 కిలోమీటర్ల పొడవును కలిగి ఉన్నాయి. వీటి ద్వారా రహదారి మౌలిక సదుపాయాలకు పెద్దయెత్తున లాభం కలుగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version