100 రోజులు పూర్తి చేసుకున్న నిత్యజనగణమన కార్యక్రమం..

-

లీడర్స్ ఫర్ సేవా సంస్థ హైదరాబాద్‌లోని నల్లకుంటలో చేపట్టిన నిత్య జన గణమనకు 100 రోజులు పూర్తయ్యాయి. కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి సతీమణి శ్రీమతి కావ్యకిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఇండియన్ అకాడమీ స్కూల్ విద్యార్థులు జాతీయ జెండాలతో ఆమెకు స్వాగతం పలికారు.

నిత్య జనగణమన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులను ఆమె అభినందించారు. నిత్యజన గణ మన కార్యక్రమాన్ని ఎప్పటికీ కొనసాగించాలనుకునేవడం గొప్ప విషయమని ప్రశంసించారు. నిత్య జన గణ మన కార్యక్రమం ద్వారా జాతీయతా స్ఫూర్తిని విస్తరింపజేస్తున్న యువతను ప్రత్యేకంగా అభినందించారు.

హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రతి ఒక్కరూ ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేసి జాతీయతా స్ఫూర్తిని చాటాలన్నారు. ఈ సందర్భంగా రచయిత నేలంటి మధు దంపతులు శ్రీమతి కావ్య కిషన్ రెడ్డి, నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ వై.అమృతను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మధు యాదవ్, రాఘవేంద్ర, నిర్వాహకులు జూకంటి ప్రశాంత్, ఎంకే శ్రీనివాస్, జశ్వంత్ అల్లి, అజ్మీరా రాజీవ్ గాంధీ, ప్రసాద్ దుబే, రవికాంత్ బస్తివాసులు తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version